11 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
లహరి, ఫిబ్రవరి 4, తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తన కార్యాలయంలో బ్రహ్మోత్సవాల పోస్టర్లు, బుక్‌లెట్లను ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు ఆలయ నాలుగు మాడ వీధుల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8.40 నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
Also Read : వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
ఫిబ్రవరి 15న రాత్రి గరుడ వాహనము, 16న సాయంత్రం 4 గంటలకు బంగారు రథం, 18న రథోత్సవం, 19న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube