ఖమ్మం కు బ్రాహ్మణ సధనం మంజూరు
-మంత్రి పువ్వాడ ప్రత్యేక చొరవ
-ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్
-ధన్యవాదాలు తెలిపిన సుడా డైరెక్టర్ మటూరు
టి మీడియా, మే12,ఖమ్మం సిటీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బ్రాహ్మణులు పై దాతృత్వం చాటుకొన్నారు.ఇప్పటికే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఒక్కో కుటుంబానికి 5 నుండి 20 లక్షల వరకు వివిధ పథకాలు ద్వారా పేద బ్రాహ్మణులు కు తిరిగి చెల్లింపు లేని డబ్బులు ఇస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రతి జిల్లా కేంద్రంలో స్థల దాతలు ముందుకు వస్తే బ్రాహ్మణులు సాంప్రదాయ అవసరాలకు ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నారు.ఖమ్మం నగరం లోని గొల్లగూడెం రోడ్డులో మాదిరాజు సీతారామ రావు బ్రాహ్మణ స్థలం ఇవ్వడం తొ పాటు ప్రభుత్వం కు స్వాధీనం చేస్తూ రిజిస్ట్రేషన్ చేశారు..ఈ విషయం లో బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మారం రాజు రాధాకృష్ణ, కీర్తి శేషులు మాదిరాజు వెంకటేశ్వర రావు, సుడా డైరెక్టేర్ మాటారు లక్ష్మీనారాయణ తదితరులు కృషిచేశారు.3 ఏళ్ళు నుండి వివిధ కారణాలు తో ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వద్దకు విషయం ను బ్రాహ్మణ పెద్దలు తీసుకు వెళ్లారు ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ,ప్రభుత్వ సలహాదారు ,పరిషత్ అధ్యక్షులు కెవి రమణాచారి తో మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలపడం జరిగింది .స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే మంజూరు ఇచ్చారని సుడా డైరెక్టేర్ మాటారు లక్ష్మీ నారాయణ తెలిపారు బ్రాహ్మణులు తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కి,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కెవి రమణాచారి కి ధన్యవాదాలు తెలిపారు త్వరలో ప్రభుత్వ, బ్రాహ్మణ పెద్దలతో చర్చించి శంకుస్థాపన కార్యక్రమము ఉంటుంది అన్నారు.ఈ మేరకు రమణ చారి మంజూరు విషయం స్థల దాత సీతారామా రావు కు తెలిపిన ఆడియో ను మాటారు విడుదల చేసారు.