బ్రాహ్మణులు గా పుట్టడం కాదు,బ్రాహ్మణత్వం కలిగి ఉండడం గొప్ప విషయం

బ్రాహ్మణులు గా పుట్టడం కాదు,బ్రాహ్మణత్వం కలిగి ఉండడం గొప్ప విషయం

1
TMedia (Telugu News) :

బ్రాహ్మణులు గా పుట్టడం కాదు,బ్రాహ్మణత్వం కలిగి ఉండడం గొప్ప విషయం

 

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిశీలిస్తే..

తెలంగాణ లో ఉమ్మడి ఏపి ఉన్న ప్పటి నుండి ఉమ్మడి ఖమ్మం కు ప్రత్యేకత ఉంది.బ్రాహ్మణ కుటుంబాల వారీ త్యాగాలు,బ్రాహ్మణత్వం కలిగి వ్యవహరించడం వల్ల ప్రత్యేకత కు కారణం అనేది చరిత్ర చెపుతోంది.బ్రహ్మేతరులు ను వీరు కలుపుకొని చేసిన కార్యక్రమాలు కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అభి జరుగుతుంది. అభివృద్ధి కి పునాది వేసింది బ్రాహ్మణులు నాయకత్వం లో నే..
ఉమ్మడి వరంగల్ జిల్లా లో నుండి ఖమ్మం ను వేరు చేయడం లో 35 ఏళ్లు ఖమ్మం మున్సిపల్ ఛైర్మెన్ గా ఉన్న చిర్ర వూరి లక్ష్మి నర్సయ్య గారు కాలంలో జరిగిన పోరాటాలు కారణం గా ఉన్నాయి.

టీడీపీ కౌన్సిలర్‌పై వైసీపీ దాడి హేయమైన చర్య

త్యాగాలు ఇవే..

– చిర్రవూరీ లక్ష్మి నర్సయ్య గారు..ఖమ్మం రూరల్ కైకొండా గూడెం లో ఉన్న ఆస్థులు తో పాటు, ఖమ్మం గాంధీ చౌక్ ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా ఉన్న తన ఇంటి ముందు భాగం స్థలం (కమర్షియల్ కాంప్లెక్స్) మున్సిపల్ చైర్మ్ న్ గా ఉన్న కాలం లో అమ్ము కొన్నారు. ఖమ్మం లో అమ్మిన అస్థి విలువ ప్రస్థుత మార్కెట్ విలువ కోట్ల లో ఉంటుంది.

– మంచి కంటి రాంకిషన్ రావు గారు 2 సార్లు ఖమ్మం ఏం ఎల్ ఏ గా పని చేశారు…500లు యకరాలు పేదలకు పంచారు.రెండవ సారి ఏం ఎల్ ఏ గా ఉన్న కాలం లో ఖమ్మం లో ఉన్న తన సొంత ఇల్లు కూడా అమ్ము కొన్నారు.

– కే ఎల్ నర్సింహ రావు గారు.ఇల్లందు కు మూడు సార్లు ఏం ఎల్ ఏ గా పని చేశారు .చనిపోయే నాటికి సొంత ఇల్లు లేదు

– గండ్లురి కిషన్ రావు గారు..ముదిగొండ మండలం భాణాపురం కు చెందిన ఈయన పేదల సంక్షేమ పోరాటాల కు ఆస్థులు అమ్మరు..ఖమ్మం మామీళ్ల గూడెం లో పేదల వ్యతిరేకి గా ఉన్న బ్రాహ్మణేతర వ్యక్తులు చేతుల్లో హత్యకు గురి అయ్యారు. ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు.

 

రోడ్డు ప్రమాదం..ముగ్గురు ఆంధ్రవాసుల దుర్మరణం

పై వారికంటే ముందు..జమాలపురం కేశవరావు గారు,దాశరథి సోదరులు, సర్వదేవభట్ల గారు ఇలా ఎంతో మంది బ్రాహ్మణులు తమ బ్రాహ్మణత్వంచాటుకొన్నారు.ఎక్కడబ్రహ్మనిజంచూపించలేదు.కులం ,మతం విద్వేషం తో వ్యవహరించ లేదు. నేటి తరం లో మాత్రం కొంతమంది బ్రాహ్మణ కుటుంబాల కుచెందిన వారు అహంబావం తో వ్యవహరిస్తున్నారు.ఇది బాధాకరం. అయితే బ్రాహ్మణుల్లో నీ అర్చక,పురోహిత వృత్తి దారులు కూడా వృత్తి నిర్వహణ కోసం,ఏ కులం, మతం,ప్రాంతం వారు కోరిన సేవలు అందిస్తూ తమ బ్రాహ్మణత్వం చాటు కొంటున్నారు.బ్రాహ్మణ ఉద్యోగులు బ్రాహ్మణత్వం తో వ్యవహరిస్తున్నారు..ఇదేమి పట్టని కొంతమంది కొంతమంది బ్రాహ్మణులు చేస్తున్న తప్పులు భూత అద్దం లో చూపి మొత్తం బ్రాహ్మణులను చులకన చేసి మాట్లాడుతున్నారు.మత, కుల పిచ్చి గాళ్లు కొంతమంది అందరిలో ఉన్నట్లు బ్రాహ్మణు ల్లో ఉన్నారు.కులం, మతం పై అభిమానం ఉండ వచ్చు అదే లోకం కాకూడదు.బ్రాహ్మణులు కన్న బ్రాహ్మణత్వం ను గౌరవించాలి అని కొరుంకొంటున్నను.

– సాహిత్య

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube