మీ బ్రాండ్లు మా వద్ద దొరకవు

మీ బ్రాండ్లు మా వద్ద దొరకవు

1
TMedia (Telugu News) :

మీ బ్రాండ్లు మా వద్ద దొరకవు

-మధ్యతరగతి వానికి భారం అయిన మద్యం

టీ మీడియా అక్టోబర్ 7 అశ్వారావుపేట

నియోజవర్గ కేంద్రమైన అశ్వారావుపేటలో ఆరు లైసెన్స్ మద్యం దుకాణాలు ఉన్నాయి. కానీ ఏ షాప్ వద్ద చూసినా జనాలు లేక ఖాళీగా ఉన్న షాపులు దర్శనమిస్తాయి. పాపం వ్యాపారం లేదని అనుకుంటే పప్పులో కాలేసినట్టే రోజుకి 30 నుండి 35 లక్షల రూపాయలు వ్యాపారం జరుగుతుంది.ఆశ్చర్యపోయారు కదూ నిజమే అదెలా సాధ్యం అనుకుంటున్నారా?అయితే ఈ కథనం చదవండి! విషయం ఏమిటంటే మద్యం ప్రియులు అత్యధికంగా సేవించే మెన్షన్ హౌస్, ఓఏబి,యంసి బ్రాందీ, 8పీఎం,యంసి డైట్, నాకౌట్,5000 బీర్లు తో పాటు మరో నాలుగు బ్రాండ్లు ఇక్కడ దొరకవు ఇవి కావాలంటే వీరి ఆధ్వర్యంలో నడిచే బెల్టు షాపుల వద్దకు వెల్లవలసిందే, అశ్వారావుపేటలో ఆరు లైసెన్స్ షాపులు ఉండంగా అనధికారికంగ సిండికేట్ అయ్యి షాప్స్ లో మాత్రం ఎమ్మార్పీ కి అమ్ముతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు.లైసెన్స్ మద్యం దుకాణాలు వచ్చి 9 నెలల కాలం అవుతున్న సిండికేట్ కాకపోవడంతో ఎవ్వరివారే పోటీ పడి వ్యాపారాలు నిర్వహించారు.

పాalso read :ము కాటు తో వ్యక్తి మృతి

 

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు సిండికేట్ అయ్యి నెలరోజులు వ్యవదిలోనే లక్షల్లో లాభాల్ని ఆర్జిస్తున్నారు. రోజుకి లక్షల్లో లాభాలను ఆర్జిస్తున్నారంటే ఎలా అని మీకు అనుమానం రావొచ్చు. ఇంతకుముందు సిండికేట్ కాలేదు కాబట్టి ఎవరి షాపుల్లో వాళ్లే ఎమ్మార్పీ దారులకు మద్యం అమ్మకాలు జరిగేవి,రాత్రి 10 గంటల వరకు అమ్మేవారు, ఇప్పుడు అంతా ఒకటి అయ్యి సిండికేట్ గా మారి అత్యధికంగా మద్యంప్రియులు,అందులో మధ్యతరగతి వారు సేవించే మద్యం బ్రాండ్లను ఏ ఒక్క బ్రాండ్ కూడా ఈ ఆరు షాపులలో ఎక్కడ ఎతికిన దొరక్కుండా చేసి అవన్నీ దొడ్డిదారిన అధిక ధరకు బెల్ట్ షాపులకి అమ్మేస్తున్నారు. మళ్ళీ ఆ బెల్టు షాపుల్లో క్వార్టర్ కి ఒక రేటు,ఆఫ్ కి ఒక రేటు,ఫుల్ కి ఒకరేటు లెక్కన మొత్తం మీద ఫుల్ బాటిల్ కి వంద రూపాయలు దాకా, అదే అర్ధరాత్రి మించితే 150 రూపాయలు దాకా బెల్టు షాప్స్ వారు వసూలు చేస్తూ వినియోగదారుల జేబులో చిల్లు పెడుతున్నారు.ఈ మద్యం సేవించేవారు అత్యధికులు మధ్యతరగతి వారే కావడం వారికి వరం గా మారింది.ఇంత దోపిడీ జరుగుతున్నా సంబంధిత ఆబ్కారీ అధికారులు చోద్యం చూస్తున్నారని తక్షణమే స్పందించి అన్ని బ్రాండ్లు లైసెన్సు షాప్స్ లో దొరికే విధంగా చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు,ఈ విషయం తెలిసిన మేధావులు డిమాండ్ చేస్తున్నారు.చూద్దాం ఏమి జరిగిద్దో?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube