బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
గుర్రం గడ్డ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి
టీ మీడియా, ఏప్రిల్ 20, వనపర్తి బ్యూరో : గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామంలో పర్యటన అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గుర్రంగడ్డ దగ్గర నిర్మాణం అవుతున్న గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు సంవత్సరాల కిందట గద్వాల ప్రాంతానికి వచ్చిన సందర్భంగా గుర్రంగడ్డ గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వెళ్లిన వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి కేసీఆర్ తక్షణమే జీవోను విడుదల చేయడం జరిగినది. అదేవిధంగా టెండర్ ప్రక్రియ పూర్తి కావడం జరిగినది. ఇప్పటివరకు పిల్లర్స్ వేయడం జరిగింది సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వలన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనివలన ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది కావున వెంటనే సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి కాంట్రాక్టర్తో త్వరగా వేగవంతంగా పనులను పూర్తి చేసి ప్రజల్లోకి బ్రిడ్జి అందుబాటులో తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి ప్రతాప్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, నీలేశ్వర్ రెడ్డి, బీచుపల్లి, జగన్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.