గుజరాత్‌:లో ఘోర ప్రమాదం

గుజరాత్‌:లో ఘోర ప్రమాదం

1
TMedia (Telugu News) :

. ఘోర ప్రమాదం

-కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జ్ -నదిలో పడ్డ 400 మంది.

                                                                                                                                     టీ మీడియా, అక్టోబర్ 30, గుజరాత్‌:

లో ఘోర ప్రమాదం జరిగింది. మోర్భి దగ్గర తీగల వంతెన కుప్పకూలింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు నదిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందాలను ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి 20 అంబులెన్స్‌లను రప్పంచారు. ప్రాణాలు కాపాడాలని జనం ఆర్తనాదాలు మిన్నంటాయి. బాధితుల్లో చిన్నారులు , మహిళలు కూడా ఉన్నారు. కాగా, బ్రిటీష్‌ కాలం నాటి వంతెనను రిపేర్ల తరువాత ఐదు రోజుల క్రితమే రీ ఓపెన్‌ చేశారు. దాంతో వంతెన అందాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. సామర్థ్యానికి మించి జనాలు వంతెనపైకి రావడంతో.. ఆ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

also read :జనసేన విద్యార్థి విభాగం కమిటీ

వంతెన చరిత్ర..
ఈ వంతెనను 1879 ఫిబ్రవరి 20న ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ప్రారంభించారు. 1880లో అప్పట్లో దాదాపు 3.5 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. వంతెన నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని అంతా ఇంగ్లండ్ నుంచి తీసుకువచ్చారు. ఈ వంతెనను దర్బార్‌ఘర్ నుండి నాజర్‌బాగ్‌కు అనుసంధానించడానికి నిర్మించారు. మోర్బిలోని ఈ వేలాడే వంతెన 140 సంవత్సరాల కంటే పురాతనమైనది. దీని పొడవు సుమారు 765 అడుగులు. ఈ వేలాడే వంతెన గుజరాత్‌లోని మోర్బీకి మాత్రమే కాకుండా యావత్ దేశంలోనే ప్రత్యేకమైనది.
ఈ ప్రమాదంపై గుజరాత్‌ పర్యటన లోనే ఉన్న ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గుజరాత్‌ సీఎం భూపేంద్రపటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. బాధితులను అన్నివిధాలా ఆదుకోవాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube