నిర్మాణం లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలి

అక్రమ వసూళ్లు నిలిపి వేయాలని డిమాండ్

0
TMedia (Telugu News) :

నిర్మాణం లో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేయాలి

– అక్రమ వసూళ్లు నిలిపి వేయాలని డిమాండ్

– గౌతం గోవర్దన్

టి మీడియా, జనవరి 19, పెద్దపల్లి : పెద్దపల్లి,జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలను కలుపుతూ రెండు జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పరచడానికి, మంథని నియోజక వర్గం లోని ఓడేడు గర్మిల్లపెల్లి మధ్య ఉన్న మానేరు వాగుపై రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల క్రితం బ్రిడ్జి నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిందని, ఎనిమిది సంవత్సరాలు గడిచినా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి కాలెదని, వెంటనే నిర్మాణం పనులు పూర్తి చేసి రెండు జిల్లాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఐ మంథని నియోజక వర్గ కార్యదర్శి కామ్రేడ్ గౌతం గోవర్దన్ గురువారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు దూరం తగ్గి రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు.బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయడం లో ఆలస్యం కావడానికి కారకులెవరో ప్రభుత్వం తక్షణమే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Also  Read : ‘నందిని’ లఘు చిత్రం ఆవిష్కరణ

అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యె వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాగుపై తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసి నిర్వహణ చేపట్టాలని, వాహన దారులపై ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా స్థానిక ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.లేనిచో సిపిఐ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube