పాలిటెక్నిక్ కు పూర్వ వైభవం తీసుకువస్తా

పాలిటెక్నిక్ కు పూర్వ వైభవం తీసుకువస్తా

0
TMedia (Telugu News) :

పాలిటెక్నిక్ కు పూర్వ వైభవం తీసుకువస్తా

– బిజెపి అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి

టీ మీడియా, నవంబర్ 24, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అనుజ్ఞా రెడ్డి వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ మైదానం,బాయ్స్ గ్రౌండ్ మైదానం ఎకో పార్కులో ఉన్న మార్నింగ్ వాకర్స్ ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరింది. టిఆర్ఎస్ ప్రభుత్వం నోటి మాటలకే పరిమితమైంది. బిజెపి ప్రభుత్వం రాగానే పాలిటెక్నిక్ పూర్వ వైభవం తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులతో పర్యాటక కేంద్రంగా మారుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వనపర్తి బాయ్స్ గ్రౌండ్లో కూరగాయల మార్కెట్లో రైతుల సమస్యలను తెలుసుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా పండించిన కూరగాయలను అమ్ముకునే వీలుగా షెడ్లను ఏర్పాటు చేసి కూరగాయలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

Also Read : చంద్రబాబు బెయిల్ పై విచార‌ణ వాయిదా

అనంతరం ప్రచారంలో భాగంగా కశింనగర్, నాగమ్మ తండా, ఎద్దుల గేరి, కందిరీగ తండా లో మహిళలు, యువతి యువకులు వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అనుజ్ఞ రెడ్డి కి హారతిని ఇచ్చి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్ నాయుడు, అధికార ప్రతినిధి పెద్ది రాజు , టౌన్ బీజేవైఎం అద్యక్షులు గజరాజుల తిరుమలెశ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube