తెగిపడినహెవీ కరెంట్ వైరు

తృటిలోతప్పినప్రమాదం

1
TMedia (Telugu News) :

తెగిపడినహెవీ కరెంట్ వైరు

-తృటిలోతప్పినప్రమాదం
-నివాసగృహాలమధ్యలోనుండిహెవీకరెంటులైన్

టి మీడియా,అక్టోబర్ 17,మణుగూరు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాస గృహాల మధ్యలో ఉన్న హెవీ కరెంట్ లైన్ వైరు తెగిపడిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో కాలనీవాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఉలిక్కిపడ్డారు. నివాస గృహాల మధ్యలో హెవీ కరెంటు లైన్ వల్ల ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని బ్రతుకుతున్నామని బాధితులు ఆరోపిస్తున్నారు.

Also Read : జర్నలిస్టు చలో గ్రీవెన్స్ జయప్రదం చేయండి

విద్యుత్ శాఖ తక్షణమే ఇళ్ల మధ్యలో నుండి హెవీ కరెంటు లైన్ ను తొలగించి ఊరు బయటకు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరిగినా ఇంతవరకు విద్యుత్ శాఖ సంబంధిత అధికారులు కరెంటు లైన్ ను మరమ్మత్తులకు పూనుకోకపోవడంతో స్థానిక ప్రజలు తెగిపడిన వైరును చూస్తూ బెంబేలెత్తిపోతున్నారు. కరెంట్ లైన్ ను విద్యుత్ శాఖ ముమ్మరంగా చర్యలు చేపట్టి ఇక్కడి నుంచి మార్చాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాకు న్యాయం జరిగేంతవరకు ధర్నా చేపడతామని విద్యుత్ శాఖ అధికారులను హెచ్చరించారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్థానికులు ఘాటుగా ఆరోపించారు. తక్షణమే తెగిపడిన వైర్ మరమ్మతులు చేపట్టి ఇక్కడి నుంచి హెవీ కరెంటు లైన్ ను మార్చాలని డిమాండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube