విరిగి పడ్డ భారీ వృక్షం ట్రాఫిక్ అంతరాయం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 30, మహానంది:

మహానంది పరిధిలోని పచ్చర్ల సమీపాన గిద్దలూరు – నంద్యాల ఘాట్ రోడ్డుపై మంగళవారం ఉదయం బలమైన గాలులతో మొదలై వర్షం కురిసింది. ఈ గాలులకు గిద్దలూరు మరియు నంద్యాల ప్రధాన రహదారి పక్కనున్న భారీ వృక్షం విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో రహదారిపై వాహనా లన్నీ నిలిచిపోయాయి. దాదాపు గంట పాటు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మహానంది రోడ్డు సేఫ్టీ పోలీసులు మరియు అటవీ శాఖ అధికారులు డిఆర్ఓ నరసయ్య, బీట్ ఆఫీసర్ నాగేంద్ర, అక్కడి స్థానిక ప్రజల సహాయంతో విరిగి పడ్డ భారీ వృక్షంను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు.

The Giddaluru -Nandyala Ghat road near Pachchar in Mahanndi district was lashed by heavy rains on Tuesday morning.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube