బిఆర్ఎస్ క్యాలెండర్ఆవిష్కరణ

బిఆర్ఎస్ క్యాలెండర్ఆవిష్కరణ

0
TMedia (Telugu News) :

బిఆర్ఎస్ క్యాలెండర్ఆవిష్కరణ

టీ మీడియా, జనవరి 14, మహబూబ్ నగర్ : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారంగా అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సూర్య నరసింహ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి ప్రభుత్వ పరంగా గ్రామాలలో రైతుబంధు, బీమా ,వృద్ధాప్య, ఆసరా పింఛన్లు,కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, బాలింతలకు కేసీఆర్ కిట్టు ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజల అందిస్తుంది ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతనే నిరుపేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయని గ్రామ ప్రజలకు సూచించారు.

Also Read : జోరుగా కోడిపందేలు ప్రారంభం

ఇంటింటికి తిరుగుతూ క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దయాకర్, ఎంపీటీసీ గణేష్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు మంగరాయి వెంకటేష్,, శ్రీధర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వీరస్వామి, నరసింహ, యాదయ్య సాగర్,, తిరుపతి, యూత్ ప్రెసిడెంట్ శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube