10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు

- బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

0
TMedia (Telugu News) :

10 ఏళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తులు

– బిఆర్‌ఎస్‌ డాక్యుమెంట్‌ రిలీజ్‌

టీ మీడియా, డిసెంబర్ 20, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ.. బిఆర్‌ఎస్‌ తెలంగాణ రాష్ట్ర ఆస్తుల వివరాలతో డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కెసిఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను పొందుపరిచి.. పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట 51 స్లైడ్స్‌తో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే డాక్యుమెంట్‌ను బిఆర్‌ఎస్‌ విడుదల చేసింది. అప్పులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్‌ఎస్‌ వ్యూహం కనిపిస్తోంది.

Also Read : పేద విద్యార్ధుల తలరాత మార్చేందుకే విధేశీ విద్యా దీవేన

స్లైడ్స్‌లో డిపార్ట్మెంట్‌ల వారీగా :
స్లైడ్స్‌లో డిపార్ట్మెంట్‌ల వారీగా ఆస్తుల గురించి వివరాలను బిఆర్‌ఎస్‌ పేర్కొంది. తెలంగాణ వచ్చిన తర్వాత 159 శాతం తెలంగాణ ఆస్తులు పెరిగాయని.. తెలంగాణ సాధించిన తర్వాత ఒక్క రూపాయి అప్పు చేస్తే రూ.1000 అస్తులు సృష్టించామని రిపోర్టులో పేర్కొంది. తలసరి ఆదాయం 151 శాతం పెరిగిందని.. టాక్స్‌ వసూళ్లు 161 శాతం పెరిగాయని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ల ఆదాయం 406 శాతం పెరిగిందని వెల్లడించింది. పంటల ఉత్పత్తి పెరిగిందని తెలిపింది. వరి 150 శాతం, పత్తి 50 శాతం పెరిగిందని తెలిపింది. గతంతో పోల్చితే సాగు విస్తీర్ణం 50 శాతం పెరిగిందని బిఆర్‌ఎస్‌ వివరించింది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube