గట్ల ఖానాపూర్ లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
-పాల్గొన్న జెడ్పిటిసి రఘుపతి రెడ్డి
టీ మీడియా, నవంబర్ 3, పెద్దమందడి : పెద్దమందడి మండలం గట్లఖానపురం గ్రామంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం, గట్లఖానాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం లో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరుగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తు కారు గుర్తుపై ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రచారంలో ఓటర్లకు చెప్పడం జరిగింది. మండల అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ.. గట్ల ఖానాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరికి వివరించి చెప్పడం జరిగింది. ప్రజల నుంచి స్పందన చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read : పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
ఇట్టి కార్యక్రమంలో రఘుపతి రెడ్డి (జెడ్పిటిసి) వేణు యాదవ్ (మండల పార్టీ అధ్యక్షులు), దయాకర్ (మాజీ ఎంపీపీ,) శివశంకర్ ( వనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్), కోట్ల వెంకటేష్ (సర్పంచ్), రఘురెడ్డి, గ్రామ బిఆర్ఎస్ నాయకులు చుక్కరవి, హన్మంతు, కోమటిశ్రీను, చిన్నికృష్ణ, శివ రాములు, పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube