-రాబోయే రోజుల్లో మన నాయకుడు కేసీఆర్ కు మరింత అండగా ఉందాం
– పిలవండి ..నేను మళ్ళీ గల్లీ గల్లీ తిరగడానికి రెడీగా ఉన్నా..
-సంక్షేమ పథకాలను విస్తుతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలి
-బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపు
వచ్చేది మన ప్రభుత్వమే… అందరం కలిసి కట్టుగా గల్లీ గల్లీ తిరుగుదాం… అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లి విస్తృతంగా ప్రచారం చేద్దామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని సీక్వెల్ సమావేశ మందిరంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం వన్ టౌన్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తల సుమావేశంలో ఎంపీ నామ మాట్లాడారు. మీరు పిలిస్తే గుమ్మం గుమ్మం తిరగడానికి నేను రెడీగా ఉన్నా.. ఇక మీరు పిలవడమే ఆలస్యం అన్నారు. ప్రతి ఇంటికి ఏదో రూపంలో సంక్షేమ పథకం చేరిందని, రానున్న రోజుల్లో మన నాయకుడు కేసీఆర్ కు మనమంతా అండగా ఉండి,పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. చిన్న చిన్న వాటిని పక్కకు పెట్టి, సమైక్యంగా పార్టీ పురోభివృద్ధికి శ్రమించాలన్నారు. ఖమ్మం లో ఎంతో అభివృద్ధి చేశాం…ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నామ పేర్కొన్నారు.
also read :నిస్వార్థ ప్రజా సేవకులు రాయల నాగేశ్వరరావు