రాష్ట్రంలో, జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనమే

గేటు దాటరన్న వారికి ఫలితాలే సమాధానం

0
TMedia (Telugu News) :

రాష్ట్రంలో, జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనమే

-గేటు దాటరన్న వారికి ఫలితాలే సమాధానం

-మాయ మోసపు మాటలు చెప్పే వారికి ఓట్లతోనే బుద్ధి చెప్పాలి

ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టీకరణ

టీ మీడియా, నవంబర్ 18, ఖమ్మం : జిల్లాలో బీఆర్ఎస్ ప్రభంజనం బాగుంది.. అన్ని స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు బ్రహ్మాoడమైన మెజార్టీతో గెలవబోతున్నారు… ఎవరైతే ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని అన్నారో అటువంటి వారికి బీఆర్ఎస్ ఫలితాలే సమాధానం చెబుతాయని పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మీడియాకి స్పష్టం చేశారు.

మాయ మోసపు మాటలతో గెలవాలనే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని అన్నారు.జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ ఎస్ ప్రభంజనం కొనసాగుతుందని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరేనని అన్నారు.ఖమ్మం జిల్లాలో ఊహించని రీతిలో బీఆర్ఎస్ పక్షంగా డిఫరెంట్ ఫలితాలు రాబోతున్నాయని, ఇందులో డౌటే లేదన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గెలుపు మాటే వినిపిస్తుందన్నారు. ఐదేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడొచ్చి గెలుస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి కుట్రలను ప్రజలే తిప్పి కొట్టి, బీఆర్ఎస్ కు పట్టం గడతారని అన్నారు.

Also Read : మేచ్చా కు బిగుస్తున్న ఓటమి ఉచ్చు

వారు సోషల్ మీడియా ను నమ్ముకుంటే మేము ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. పదేళ్లు కేసీఆర్ నేతృత్వంలో జరిగిన బ్రహ్మాoడమైన నెంబర్ వన్ అభివృద్ధి, సంక్షేమ ఫలాలే బీఆర్ఎస్ గెలుపు సోపానాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు మావైపే ఉన్నారని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube