తెలంగాణ ప్రజలకు కాపలదారు బీఆర్ఎస్..అందుకే ఆలోచించి ఓటేయండి
తెలంగాణ ప్రజలకు కాపలదారు బీఆర్ఎస్..అందుకే ఆలోచించి ఓటేయండి
తెలంగాణ ప్రజలకు కాపలదారు బీఆర్ఎస్..అందుకే ఆలోచించి ఓటేయండి
– సీఎం కేసీఆర్
టీ మీడియా, నవంబర్ 2, నిర్మల్ : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి.. ఎన్నికలు అన్నప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. అందర్నీ ఒకటే ప్రార్థిస్తున్నాను. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇప్పటికి ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే అది వచ్చిందో ఆ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నో రెట్లు ముందు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. నేను చెప్పే మాటలను గ్రామాల్లో, బస్తీల్లో చర్చ పెట్టాలని కేసీఆర్ సూచించారు. కారణం ఏందంటే.. ఎలక్షన్లు వచ్చాయి. రెండో మూడో నాలుగో పార్టీలు పోటీ చేస్తాయి. ఇంద్రకరణ్ రెడ్డి లాగా ఇతర పార్టీల నుంచి కూడా ఎవరో ఒకరు పోటీలో ఉంటారు. 30న ఓట్లు వేస్తారు. 3న లెక్క తీస్తారు. ఎవరో ఒకరు గెలుస్తరు.
Also Read : లంచం తీసుకున్న ఈడీ అధికారులు
ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తది వచ్చే ఐదేండ్లు. పార్టీల అభ్యర్థలు మంచి చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది.. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలని ఆలోచించే కాపలదారే బీఆర్ఎస్. ప్రజల హక్కుల కోసం 15 ఏండ్లు నిర్విరామంగా పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి సాధించుకున్నాం. రెండు సార్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? ఇవన్నీ ఆలోచించాలి. నిర్మల్ జిల్లాను చేయించింది ఇంద్రకరణ్ రెడ్డినే. ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేద్దాం ఎన్ని జిల్లాలు చేద్దామని ఆలోచించాం. ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల చేయాలని నిర్ణయించాం. ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ గంట తర్వాత వచ్చారు. బాసర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతది. కాబట్టి నాలుగు జిల్లాలు చేయాలని అడిగారు.
Also Read : తెలంగాణ పధకాలు దేశానికే ఆదర్శం
నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాలని గంటసేపు వాదించారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్రకరణ్ రెడ్డినే. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలు చేయెత్తి దండం పెడుతున్నారు. నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగారు. తను పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి.. ఒకదాని తర్వాత ఒకటి అడుగుతున్నాడు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సభతో ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిండని తెలిసిపోయింది. ప్రజల కోసం తండ్లాడే వ్యక్తి. నిర్మల్ చాలా అభివృద్ధి జరిగింది. ఇంజినీరింగ్ కాలేజీ పెద్ద విషయం కాదు.. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 వేలు దాటాలి.. కచ్చితంగా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్యత నాది అని కేసీఆర్ పేర్కొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube