పేదలకు భరోసా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో

పేదలకు భరోసా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో

0
TMedia (Telugu News) :

పేదలకు భరోసా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో

– మంత్రి జగదీశ్‌ రెడ్డి

టీ మీడియా, నవంబర్ 3, సూర్యాపేట : పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్ మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అని చెప్పారు. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సూర్యాపేటలో తన సతీమణి సునితతో కలిసి మంత్రి జగదీశ్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో బీఆర్‌ఎస్‌కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్ల పెంపు, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌, రైతుబంధు రూ.16 వేలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్‌ ఆరోగ్యరక్షకు రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ.3 వేలు, మహిళలకు జీవనభృతి, రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు.

Also Read : తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కాలేజీల్లో ఐటీ సోదాలు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube