అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్సే గెలువాలి

అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్సే గెలువాలి

0
TMedia (Telugu News) :

అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్సే గెలువాలి

– మంత్రి తలసాని

టీ మీడియా, నవంబర్ 29, హైదరాబాద్‌ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుపై ఓటేసి బీఆర్‌ఎస్‌ పార్టీని మరోసారి గెలిపించాలని సనత్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ నగర అభివృద్ధి జరిగిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా జరుగని అభివృద్ధి, కేసీఆర్ పాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, ఐటీ రంగం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో హైదరాబాద్‌ నగరం అద్భుతంగా రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రజలు ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు.

Also Read : గ్యారెంటీ కార్డుతో రేవంత్ రెడ్డి బిర్లా టెంపుల్ లో పూజ‌లు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube