గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పార్టీ భగ్గు

- రోడ్లెక్కిన కారేపల్లి గులాబీ శ్రేణులు

0
TMedia (Telugu News) :

గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పార్టీ భగ్గు

– రోడ్లెక్కిన కారేపల్లి గులాబీ శ్రేణులు

– పేదల నడ్డి విరుస్తున్న బిజెపి మోడీ

టీ మీడియా, మార్చి 3, కారేపల్లి : పేదల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతోంది. సిలిండర్ పై మళ్లీ ధరలు పెంచడం దారుణమైన చర్య. పెరిగిన గ్యాస్ ధ‌ర‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు, వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఆదేశానుసారం శుక్రవారం కారేపల్లి మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్ ల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన, ర్యాలీ చేపట్టారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిర‌స‌న కార్యక్రమాన్నీ పెద్ద ఎత్తున చేపట్టారు.

గ్యాస్ స్టవ్‌లపై కట్టెలు పెట్టి మోదీ ప్రభుత్వం పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోదీ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పేదలకు పెను భారంగా మారిన పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.బిజెపిని గెలిపిస్తున్నందుకు దేశ ప్రజ లకు మోడీ రిటర్న్‌ గిఫ్టుగా గ్యాస్‌ ధరలు పెంచి ఇస్తున్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014లో రూ.450 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1150కు చేరిందని విమ ర్శించారు. ఇది గాక సిలిండర్‌ తీసుకు వచ్చిన బోరు రూ.30 నుండి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని దీంతో గ్యాస్‌ సిలిండర్‌కు రూ.1200 చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇదిలా ఉం డగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌కు ఏకంగా రూ.350 పెంచారని దీంతో హోటళ్లు, టిఫిన్‌ బండ్లు, పకోడి, బజ్జీ, మసాలా బండ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బం ది పడుతున్నాన్నారు. ఈ గ్యాస్‌ ధర పెంపు తో వారి వారి వృత్తులను మానివేసే రోడ్డు న పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్‌ ధరలు వెం టనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

Also Read : నడక మార్గంలో తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..

లేని పక్షంలో ప్రజాఉద్యమాన్ని ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బిజెపి నాయకులను మహిళలు తరిమి కొడతారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతీ, ఎంపీటీసీ ధారవత్ పాండ్య నాయక్, సర్పంచ్ లు భూక్య రంగా రావు, అజ్మీర నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అనుబంధ సంఘ నాయకులు, గ్రామశాఖ ల అధ్యక్షులు, మండల మహిళల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube