బర్రెలక్క‌ను చూసి బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోంది

బర్రెలక్క‌ను చూసి బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోంది

0
TMedia (Telugu News) :

బర్రెలక్క‌ను చూసి బీఆర్ఎస్ సర్కార్ భయపడుతోంది

– సీపీఐ నేత నారాయణ

టీ మీడియా, నవంబర్ 24, ఖమ్మం బ్యూరో : సీపీఎం, సీపీఐ లిస్ట్‌కు కాంట్రవర్సీ లేదని సీపీఐ నేత నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో తాము భాగస్వాములమన్నారు. ప్రియాంకగాంధీ సభలో పాల్గొంటున్నట్లు చెప్పారు. జాతీయ నాయకులు టి.రాజా ఖమ్మం వస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ముదుర్లని.. ఐదు సీట్లు అడిగితే తమకు ఒక్క సీటే కేటాయించారని తెలిపారు. వివేక్ గద్దలా తమకు కేటాయించాల్సిన సీటు ఎత్తుకుపోయారని విమర్శించారు. రాజాసింగ్ కరుడుగట్టిని హిందుత్వవాదన్నారు. బీజేపీని, మోదీని తూలనాడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. తాము మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికలకు వెళ్ళామని చెప్పారు. ఉత్తరప్రదేశ్ వరకు బీజేపీ బలంగా ఉందని.. ఇప్పుడు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తెలిపారు. దేశం పేరు కూడా మార్చేందుకు బీజేపీ యత్నిస్తోందని.. ఇండియాను భారత్ అనే పేరుగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధమని.. దానిని అందరూ ఖండించారని.. కానీ సీఎం కేసీఆర్ తమకు సంబంధం లేదని ఎద్దేవా చేశారని విమర్శించారు. బీజేపీ అనుకూలంగా ఉన్నవారు ఎంత క్రూరుడైనా బయట ఉంటాడా?.. బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు మంచివాడు అయిన జైలుకు వెళ్లాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.

Also Read : ప్రయాణికుల సమస్యను పరిష్కరించిన డిపో మేనేజర్ వేణుగోపాల్

ముఖ్యమంత్రి నీళ్ళు లేని బాయిలో దూకిచావచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరించారన్నారు. బర్రెలక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమెను చూసి భయపడుతోందన్నారు. తండ్రికి మూడు నామాలు పెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది అజయ్‌నే అని.. తండ్రినే మోసం చేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మొదట ఓడేది పువ్వాడ అజయ్‌ అని.. ఆయనకు అహం బాగా పెరిగిపోయిందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube