జమ్మూకాశ్మీర్ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు

- ఎస్సీ రిజర్వేషన్ కు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

0
TMedia (Telugu News) :

జమ్మూకాశ్మీర్ బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు

– ఎస్సీ రిజర్వేషన్ కు బీఆర్ఎస్ కట్టుబడి ఉంది

– 2014లోనే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాం

– లోక్ సభ లో ఎంపీ నామ నాగేశ్వరరావు

టీ మీడియా, డిసెంబరు 6, న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ రిజర్వేషన్ ( అమెoడ్మెంట్ ) బిల్లు తో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనేషన్ ( అమెoడ్మెంట్) బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ రెండు బిల్లులపై బుధవారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ లకు సంబంధించి దేశంలో జన గణన కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలని నామ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం 2014, నవంబర్ 29నే అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి, కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈ బిల్లు కేంద్రం వద్దనే పెండింగ్ లో ఉందని నామ పేర్కొన్నారు.

Also Read : క‌ర్ణి సేన చీఫ్ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలి

తెలంగాణా అసెంబ్లీ సీట్ల సంగతి తేల్చండి :
జమ్మూ కాశ్మీర్ బిల్లులను ఆమోదించడం సమర్థనీయమే కానీ ఏపీ పునర్విభజన
చట్టం ప్రకారం తెలంగాణా కు సంబంధించి కేంద్రం వద్ద అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయని నామ తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 153కు పెంచాల్సి ఉండగా, ఇంతవరకు పెంచలేదని , ఈ అంశాన్ని త్వరితగతిన తేల్చాలని అన్నారు. అలాగే ఏపీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలను 225కి పెంచుతామని అన్నారని నామ పేర్కొన్నారు..

Also Read : భార‌తీయ సంస్కృతిని కాంగ్రెస్ అవ‌మానిస్తోంది

ఎస్టీలుగా వడ్డెరలు :
రిజర్వేషన్లు గురించి ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణా లో బీసీలుగా ఉన్న వడ్డెర కులస్తులను ఎస్టీలుగా పరిగణిస్తూ వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని నామ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వీరు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా కొనసాగుతున్న అంశాన్ని నామ గుర్తు చేశారు. వారి సామాజిక ఆర్థిక అంశాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకోవాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube