గెలుపు మళ్లీ బీఅర్ఎస్ దే
– హ్యాట్రిక్ సీఎం కేసీఆర్
– అభివృద్ధి – సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తున్నాం
టీ మీడియా, ఆగస్టు 6, వనపర్తి బ్యూరో : తెలంగాణ అమలుచేస్తున్న పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూఅమలుకావడంలేదు.అందుకేదేశమంతాతెలంగాణఅభివృద్ధిమీదదృష్టిసారించింది.తెలంగాణ పథకాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదు .పనిచేసే ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి.హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో బీఆర్ఎస్ లో చేరిన పెబ్బేరు నాలుగో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ పార్వతి మహేందర్ గౌడ్, మరో 50 మంది .. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీ సాయినాథ్, వైస్ చైర్మన్ కర్రె స్వామి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు చిన్న ఎల్లారెడ్డి, గోపీ బాబు, అక్కల జ్యోతి, సుమతి, మాజీ ఎంపీటీసీ శివశంకర్ గౌడ్, మాజీ సర్పంచ్ రాజశేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు కట్ట శ్రీనివాస్ రెడ్డి, సాయినాథ్ , శోభారాణి , మమత, పల్లవి తదితరులు పాల్గొన్నారు.