పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

1
TMedia (Telugu News) :

పాక్‌ డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

టీ మీడియా, డిసెంబర్ 3, అమృత్‌సర్‌ : పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న చురివాలా చుస్తీ సమీపంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌ వైపు నుంచి వస్తున్న ఓ డ్రోన్‌ను గుర్తించారు. దీంతో దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. దానిని మూడు ప్యాకెట్లలో ఉన్న 7.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఓ పిస్తోల్‌, రెండు మ్యాగజైన్లు, 50 రౌండ్ల 9 ఎంఎం బుల్లెట్లను సీజ్‌ చేశారు.

Also Read ; స్పైస్‌జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం..

ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. ఈ కన్‌సైన్‌ మెంట్‌ను ఎవరికి చేరవేస్తున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఈ ఏడాది 17 పాక్‌ డ్రోన్లను కూల్చివేశామని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube