బిఎస్ఎన్ఎల్ యూనియన్ ఎన్నికల ప్రచారం

బిఎస్ఎన్ఎల్ యూనియన్ ఎన్నికల ప్రచారం

1
TMedia (Telugu News) :

బిఎస్ఎన్ఎల్ యూనియన్ ఎన్నికల ప్రచారం

టీ మీడియా, సెప్టెంబర్ 22, మధిర : భారతీయ సంచారనిగం లిమిటెడ్ సంస్థ లో అక్టోబర్ 12 న జరగనున్న 9వ గుర్తింపు ఎన్నికలలో సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల ప్రచారం లో బాగంగా బుదవారం మధిర టెలిఫోన్ ఎక్సేంజ్ లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. సీరియల్ నెంబర్ 8 సెల్ ఫోన్ గుర్తు పే పోటీలో ఉన్న సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ గెలిపించాలని, యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యతిరేక విధానాల మూలంగా సంస్థ కు 4G కేటాయింపు జరగలేదని, ప్రైవేట్ టెలికాం కంపెనీ లకు అనుకూలంగా ప్రభుత్వం నడుస్తోందని, బిఎస్ఎన్ఎల్ పరిరక్షణ, ఉద్యోగుల హక్కులను కాపాడడం కోసం ఎంప్లాయిస్ యూనియన్ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని. కరోన మహమ్మారి, బారిన పడిన సంస్థ ఉద్యోగుల కుటుంబాలకు 3లక్షల తక్షణ ఆర్థిక సహాయం, చనిపోయిన ఉద్యోగి కుటంబానికి, 10లక్షల ఆర్ధిక సహాయం ఎంప్లాయిస్ యూనియన్ కృషి తోనే సాధించామని, ఉద్యోగుల భవిషత్తు, సంస్థ బాగుండాలంటే ఎంప్లాయిస్ యూనియన్ ను గెలిపించడం, ద్వారానే సాధ్యమని సంస్థ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుమల్ మరింగంటి ఈ సందర్భం గా తెలియచేశారు.

 

Also Read : ప్రవైట్ ఆస్పత్రులు పై ప్రభుత్వం కొరడా

ఈ ప్రచార సభ లో ఏఐబి డిపిఏ నాయకులు, శంకర్రావు, భాస్కర్ రావు, బసవరాజు, రాఘవరావు బిఎస్ఎన్ఎల్ నాయకులు నాగామల్లు, నాగేశ్వరరావు, సుబ్బారావు, మధిర నాయకులు,వేంకటేశ్వర్లు, నాగేశ్వర్ రావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, నిర్మల, తదితరుల పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube