బీఎస్పి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి
టీ మీడియా, నవంబర్ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి నియోజకవర్గం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి, సర్వబోముఖాభివృద్ధికి అంకితమైన మన వనపర్తి గడ్డకు చెందిన బిడ్డ నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి నియోజకవర్గం అభ్యర్థిగా శాసనసభఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కావున అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. విద్యార్థి ఉద్యమంలో విద్యార్థుల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి దశలో పోరాడినారు. కష్టజీవుల, కార్మికుల నిరుపేదల హక్కుల కోసం, భూపోరాటాల్లో, బుడ స్థలాల కోసం పోరాటంలో, ఆకలి చావులు సంభవించిన తీవ్ర కరువు పరిస్థితుల్లో “అంజలి కేంద్రాలు” “ఆమ్లం కేంద్రాల” నిర్వహణలో అంకితభావంతో పని చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డులు అందుకొన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు అరెస్టు అయినారు. తెలంగాణ ఉద్యమ నేతగా రాష్ట్ర టీఎఎస్ స్టీరింగ్ కమిటీ సభ్యునిగా పనిచేసి తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి అనేక గ్రామాల్లో ధూంధాం కార్యక్రమాల్లో ప్రసంగించి పల్లె పల్లెలో తెలంగాణ చైతన్యం రగిలించి తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు అయ్యేంత వరకు అటుపెరుగని పోరాటం చేశారు.
Also Read : నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతం చేయాలి
స్వరాష్ట్రం సాధించిన తరువాత బహుజనులైన బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు, అగ్రకుల పేదలకు 190% ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించి, ‘తెలంగాణ రాష్ట్రంలో దొర గడీల “పాలన” అంతం చేయుటకు బహుజన రాజ్యం స్థాపన కోసం 89 ముఖ్య మంత్రి అభ్యర్థి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఎస్, ప్రవీణ్ కుమార్ ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన చైతన్యం కలిగిస్తూ చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్రకు, నిరంతరం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా! రాజీలేని పోరాటం చేస్తున్నందున డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగు జాడల్లో నాలుగున్నర సంవత్సరాల ప్రధానోపాధ్యాయుడి ఉద్యోగానికి రాజీనామా చేసి రూ. 1,40,000/-లు నెలసరి వేతనం వదలుకొని బీఎస్పీ జిల్లా అధ్యక్షులుగా, వనపర్తి అసెంబ్లీ ఇన్చార్జ్ గా పనిచేసి పల్లెపల్లెకు, ఇంటింటికి బహుజన వాదాన్ని తీసుకవెళ్తూ. పోరాదుతున్న నాగనమోని చెన్నరాములు ముదిరాజ్ బహుజన్ సమాజ్ పార్టీ వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిరంతరం ప్రజల మనిషిగా, పేదల పెన్నిదిగా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నారు. కాబట్టి మీ విలువైన ఓటు “ఏనుగు గుర్తుకు చేసి” నాగనమోని చెన్నరాములు ముదిరాజుని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. బిఎస్పి “లిసి రాజ్యాధికారం బీఎస్పీతోనే సాధ్యం”, ”రాజ్యాధికారమే మా అంతిమ లక్ష్యం” వనపర్తి నియోజకవర్గం, రేవల్లి మండలం, శానాయిపల్లి గ్రామంలో గడప గడపకు బీఎస్పి ప్రగతి భవన్ కు ఆర్ఎస్పి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటా ప్రచారం నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెన్న రాములు ముదిరాజ్ 99 శాతం ఉన్న బహుజనులకే పట్టం కట్టాలని ఇంటింటా తిరుగుతూ ప్రజలను అభ్యర్థించారు.
Also Read : అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన అధికారులు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మిద్దె మహేష్ మాట్లాడుతూ 70 సంవత్సరాల నుంచి అగ్రకుల పార్టీలకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తా ఉన్నాం మరి ఒక్కసారి బహుజన వాదాన్ని వినిపిస్తూ 60 మంది ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. అసెంబ్లీ కార్యదర్శి కుంటి మధు, మండల కార్యదర్శి పూర్ణ కంటి దేవేందర్, సెక్టార్ అధ్యక్షులు వడేమను రాములు, బూత్ కమిటీ అధ్యక్షులు జటప్రోలు మధు, పూర్ణం కంటి యాదగిరి, తలుపునూరు గ్రామ అధ్యక్షులు బంగారయ్య, మోగుగలాల్ ,రాజు, సుల్తాన్, శివ, బీముడు, పానుగంటి నితీష్, కళ్యాణ్, హుస్సేన్, మిద్దె రవి గ్రామ నాయకులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube