బి ఎస్ పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

టి మీడియా ,నవంబర్ 23 వెంకటాపురం :
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ప్రభుత్వ అతిథి గృహంలో బహుజన సమాజ పార్టీ బి ఎస్ పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకను కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా ఉపాధ్యక్షులు యాసం సిద్ధార్థ పూలే హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా దామాషా ప్రకారం, రాజ్యాధికారంలో వాటా కావాలనే సంకల్పంతో తన అత్యున్నత పోలీస్ అడిసినల్ డిజిపి పదవి కి రాజీనామా చేసారని తెలిపారు. మహాత్మా జ్యోతి బాపులే, అంబేద్కర్, కాన్సిరం లాంటి మహనీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నటువంటి బహుజన సమాజ పార్టీలో చేరి బహుజనుల గొంతుకగా మారిన త్యాగడనుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమారని కొనియాడారు.

తెలంగాణలో రాజరికపు పాలనకు చారమ గీతం పాడి బి సి, ఎస్సీ ఎస్టీలను ఐక్యం చేసే అన్ని రంగాలలో బహుజనులను ముందు వరుసలో నిలబెట్టడానికి తాను ముందున్నారని, ప్రాణం పోయినా పర్వాలేదు రాజ్యాధికారంలో సంపూర్ణ నిర్ణయాధికారం బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ద్వారానే సాధ్యమవుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సీనియర్ ఉద్యమకారులు పునేం సాయి , మండల నాయకులు వేల్పుల నవీన్, చిట్యాల సాగర్, వెంకటేష్, నరసింహారావు, సీనియర్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube