కొత్తకోట మండలంలో బిఎస్పి సుడిగాలి ప్రచారం

-రోజురోజుకు స్పీడ్ అందుకుంటున్న బిఎస్పి

0
TMedia (Telugu News) :

కొత్తకోట మండలంలో బిఎస్పి సుడిగాలి ప్రచారం

-రోజురోజుకు స్పీడ్ అందుకుంటున్న బిఎస్పి

టీ మీడియా, నవంబర్ 16, కొత్తకోట : కొత్తకోట మండల కేంద్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవరకద్ర బీఎస్పీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి. కొత్తకోట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బసిరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాధికారం బహుజనులకు రావాలంటే దేవరకద్ర గడ్డపై బీఎస్పీ పార్టీని అందరం కలిసికట్టుగా గెలిపించుకోవాలని, భారీ మెజార్టీతో ఒక బీసీ బిడ్డను గెలిపిస్తే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని అన్నారు. బహుజనులు ఏకమైతే బ్రతుకులు మారుతాయని ఏనుగు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి, అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు. బహుజన సమాజ్ పార్టీ స్వచ్ఛందంగా ప్రజలతో స్వీకరించిన నిది తోనే, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల చేత బిఎస్పీ ఒక నోటు తీసుకోవడంతో పాటు-ఒక ఓటు తప్పకుండా వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నితి, నిజాయితీగా పాలనను అందించడానికి బీఎస్పీ, పార్టీకి ప్రజల అండ దండాలు, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. అలాగే ప్రతి మండలానికి కార్పొరేట్ పాఠశాల, వైద్యశాలను ఏర్పాటు చేసి, విద్య వైద్యాన్ని ఉచితం చేస్తామని అన్నారు. బిఎస్పిపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మధునాపూర్ మండలం తీర్మాలయాపల్లి గ్రామలో గ్రామ కమిటీ లతో, గ్రామానికి చెందిన యావకులు బిఎస్పి పార్టీలో చేరారు.

Also Read : పని చేసే నాయ‌కుడినే ప్రజలు ఆశీర్వదించాలి

ఈ కార్యక్రమంలో ఫాతిమా బేగం దేవరకద్ర మహిళా కన్వీనర్, రవీందర్ సిసి కుంట అధ్యక్షుడు, జి సాగర్ దేవరకద్ర అధ్యక్షులు, సంతోష్ కౌకుంట్ల అధ్యక్షుడు, ప్రసాద్ అడ్డాకల్ అధ్యక్షుడు, బురాన్ నాయుడు మండల అధ్యక్షుడు, సి.కురుమన్న నాయుడు అసెంబ్లీ ఉపాద్యక్ష్యలు, అజ్జకొల్లు మండల ప్రధాన కార్యదర్శి బాలయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube