నాణ్యతలేని బిటి రోడ్డు

నాణ్యతలేని బిటి రోడ్డు

0
TMedia (Telugu News) :

నాణ్యతలేని బిటి రోడ్డు

టీ మీడియా, జనవరి 11, ఏటూరునాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఐ టి డి ఎ నుండి రొయ్యూరు మీదుగా తుపాకుల గూడెం వరకు నూతనంగా వేసిన బీటు తారు రోడ్డు నాణ్యతను పరిశీలించడం జరిగింది ఈ క్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట.రఘు మాట్లాడుతూ ఐ టి డి ఎ నుండి తుపాకులగూడెం వరకు వేసిన తారు రోడ్డు నిర్మాణంలో అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి వారి ఇష్టానుసారంగా రోడ్డు నిర్మాణం చేసి సైడ్ డాంబర్ పోయాక కూలిపోతుందని అదేవిధంగా కల్వర్టుల దగ్గర పైపుల మధ్యన గ్యాపు వల్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు సదరు కాంట్రాక్టర్ నామమాత్రపు పనులు చేస్తున్నందున వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈసం వీరయ్య, నాగవత్, కిరణ్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube