బడ్జెట్ అంతా అంకెల గారడే : ఎమ్మెల్యే ఈటల

బడ్జెట్ అంతా అంకెల గారడే : ఎమ్మెల్యే ఈటల

0
TMedia (Telugu News) :

బడ్జెట్ అంతా అంకెల గారడే : ఎమ్మెల్యే ఈటల

టీ మీడియా, ఫిబ్రవరి 6, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు. చాలా డిపార్టుమెంట్లకు కోత పెట్టారని పేర్కొన్నారు. రుణమాఫీ చెయ్యాలని రైతుకు కోరుతున్నారని చెప్పారు. బ్యాంకుల దగ్గరకు వెళ్లే రుణం ఇవ్వబోమని చెబుతున్నారని.. ఈ విషయం బీజేపీ దృష్టికి వచ్చిందన్నారు. పూర్తి రుణమాఫీ చేయాలనీ కోరుతున్నామని తెలిపారు. ఉద్యోగులకు హౌసింగ్ రుణాలు ఇవ్వడం లేదని విమర్శించారు. టైమ్ కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. సెర్ఫ్, వివోలకు జీతాలు పెంచలెదన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వర్కర్ల పరిస్థితి దారుణంగా ఉందని.. వారికి ఇచ్చేది నెలకు వెయ్యి రూపాయలా.. అవి కూడా సకాలంలో ఇవ్వడం లేదని విమర్శించారు.కే సీ ఆర్ కిట్టు కూడా సకాలంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. బాసరలో చదివే ఐఐటీ విద్యార్థులు 3 నెలలు ధర్నా చేశారని గుర్తు చేశారు.

Also Read : నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ..

ఫుడ్, స్టాఫ్, మౌళిక సదుపాయాలు సరిగ్గాలేవన్నారు. ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ట్రీట్ మెంట్ జరగడం లేదని వెల్లడించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా పైసలు ఇవ్వడం లేదని గుర్తు చేశారు. పైరవీ చేసుకునే వాళ్ళకే కాంట్రాక్టర్లకు బిల్లులిస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ పై విమర్శలు చేయడం లేదని.. ఆర్బాటం తప్పా మరేం లేదని ఎద్దేవా చేశారు. బెల్ట్ షాపులతోనే ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి ఏడాదికి వస్తుందన్నారు. హరీష్ రావు.. మీ గొప్ప దార్శనికత అమల్లో చూపించండి అని సూచించారు. 78 నుంచి 80శాతం నిధులు ఖర్చు చేయలేదన్నారు.బడ్జెట్ ప్రజలను మోసం చేసేలా ఉందని విమర్శించారు. రైతాంగానికి రుణమాఫీ నాలుగేళ్లు అయినా చేయలేదన్నారు. అత్యధిక ఎగవేత దళారులు రైతులపై ముద్ర పడుతుందన్నారు. రైతు రుణమాఫీపై ఊసె లేదు.. చేస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీ రాకపోవడంతో ఈఎంఐలు సమయానికి చెల్లించలేక పోతున్నారని పేర్కొన్నారు. సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదని చెప్పారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు.. అవి కూడా రెండేళ్ళకు ఓ సారి ఇస్తున్నారని విమర్శించారుకేసీఆర్ కిట్ కు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అంగన్ వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కి పోయిన ఆహారం అందుతుందన్నారు. బాసరా త్రిపుల్ ఐటీలో ప్రభుత్వం నిర్లక్ష్యం తో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

Also Read : పచ్చి పాలతో ఇన్ని ప్రయోజనాలా..

గురుకులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మన ఊరు మన బడి కేవలం చెప్పడానికే రంగు రంగులుగా కనిపిస్తుందన్నారు. ఈహెచ్ఎస్ పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స ఇవ్వలేమంటున్నారని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో మందులు కూడా అందడం లేదన్నారు. విద్యావాలంటర్లీకు, విదేశీ విద్య కు వెళ్లే వారికి సరైన సమయానికి డబ్బు రావడం లేదన్నారు. కాంట్రాక్టర్ లకు ఏ శాఖలోనూ సమయానికి బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పెట్టింది బెల్ట్, లిక్కర్ పాపులేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను తాగిపించి చంపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చెప్పేవి గొప్పలు చేసేవీ శూన్యం అన్నట్టుగా బడ్జెట్ ఉందన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube