టీ మీడియా, డిసెంబర్ 10, మహానంది:
మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో గౌరవ సభ నిర్వహించారు
ఈ సందర్బంగా మాజీ ఎంమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం అనేది మన భారతీయ సంస్కృతి విలువలను ప్రతిబింబిస్తుందని, అలాంటి మహిళల పట్ల అసెంబ్లీ లో నీచంగా మాట్లాడి కౌరవసభ గా మార్చారని, మహనీయుడు కీర్తి శేషులు నందమూరి తారక రామారావు బిడ్డకే కౌరవసభలో అవమానం జరిగిందన్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అందుకే ఈ కౌరవుల సభను కూల్చివేసి ముఖ్యమంత్రి గా చంద్రబాబునాయుడుని చేసి గౌరవసభ గా మార్చాలని కోరుతున్నామన్నారు. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వన్ టైం సెటిల్మెంట్ పేరుతో గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆర్థిక సాయంతో గృహ నిర్మాణాలు నిర్మించుకున్న వారు నుంచి పది వేల రూపాయలు పైనే వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ALSO READ : ఖేల్ కబడ్డీలో సత్త చాటిన ఎక్సలెంట్ స్కూల్ విద్యార్ధి
నవరత్నాల పేరుతో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని పాలకులు ప్రకటనలు చేస్తున్న పేద ప్రజలు నిత్యవసర వస్తువులను అధిక ధరలతో కొనలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.రైతులు గిట్టుబాటు ధర లేక వరి దాన్యాన్ని దళారులకువిక్రయిస్తున్నారని వెంటనే ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ పాలనలో అభివృద్ది సున్యం వైసీపీ వాళ్ళు చేసే అరాచక పాలన కు తొందర్లోనే వడ్డీతో సహా చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని. టీడీపీ ప్రభుత్వం లో గాజులపల్లి గ్రామంలో అభివృద్ది చేసిన ఘనత కొండారెడ్డికె దక్కుతుందన్నారు..
ఈ కార్యక్రమంలో మహానంది మండల దేవస్థానము మాజీ చైర్మన్ , బాన్నురు రామలింగ రెడ్డి,టీడీపీ మండల అధ్యక్షుడు ఉల్లి మధు,గాజులపల్లె గ్రామ టిడిపి నాయకురాలు శశి కళ కొండారెడ్డి , క్రాంత్ కుమార్ ,నంది రెడ్డి మహేశ్వర రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డి,టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.