గ్రామపంచాయతీ భవనాలను నిర్మించండి

మంత్రిఎర్రబెల్లి ని కలిసి వినతి అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు

1
TMedia (Telugu News) :

గ్రామపంచాయతీ భవనాలను నిర్మించండి

మంత్రిఎర్రబెల్లి ని కలిసి వినతి అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు
టీ మీడియా, జూన్ 30, సత్తుపల్లి : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిసి వినతి పత్రాన్ని అందజేసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య .గ్రామపంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో నూతన భవన నిర్మాణాలు చేపట్టాలని కోరుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాదు నందు వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Also Read : ఎస్సీ బాలికల వసతి గృహంలో 95శాతం ఉత్తీర్ణత

సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు భవనాలు లేక గ్రామ సభలు నిర్వహించడానికి, పెన్షన్లు ఇవ్వటకు, గ్రామ ప్రజలు పలు సమస్యలపై గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకొనుటకు, గ్రామానికి సంబంధించిన పత్రాలు, గ్రామ ప్రజలకు సంబంధించిన సమాచార పత్రాలను పొందుపరచుటకు ఇబ్బందిగా ఉన్నదని కావున సత్వరమే గ్రామపంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో భవన నిర్మాణ లకు ఏర్పాట్లు చేయాలని కోరారు. అదేవిధంగా గ్రామాల్లో పలు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని, పూర్తి చేసిన ఈజీఎస్ పనులకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube