బీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్

బీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్

1
TMedia (Telugu News) :

బీజేపీలో చేరిన బూర నర్సయ్య గౌడ్

టీ మీడియా,అక్టోబర్ 19,దిల్లీ : టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ ఛుగ్  సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా బిజెపి పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. బూర నర్సయ్యగౌడ్ తో పాటు..కాంగ్రెస్‌ నేత వడ్డేపల్లి నర్సింగ్‌రావు కుమారుడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు,  పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, టిడిపి నేత రవిప్రకాశ్ యాదవ్ తో పాటు…పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

Also Read : పోలవరం ఆర్ ,ఆర్ రీసర్వే చేసి ముంపు వాసులను జాబితాలో చేర్చాలి

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ  కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. టిఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రలోని బిజెపి ప్రభుత్వ చొరువతోనే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశానన్నారు. ప్రధాని మోడీ స్పూర్తితో సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో ముందుకు పోతానని చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube