విద్యుత్ వినియోగదారులపై పెనుభారాలు తగ్గించాలి
– ఏ సి డి చార్జీలు రద్దు చేయాలి
టీ మీడియా, ఫిబ్రవరి 6, భద్రాచలం : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం ముందు విద్యుత్ వినియోగదారులపై పెను బారాలను మోపే ఏ సి డి చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి అనంతరం డివిజనల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వేణుకు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపుతుందని ఇప్పటికే విద్యుత్ చార్జీల మోతకు తట్టుకోలేకపోతున్న పేద వర్గాలు. వేతనజీవులు. నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్లీ ఏ సి డి చార్జీల పేరుతో ప్రజలను దోపిడీ చేసే విధానాలను ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులు స్వస్తి పలకాలని అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా హామీని నిలబెట్టుకొని రైతాంగానికి కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని కోరారు.
Also Read : ప్రజావాణిలో కలెక్టర్ కు వినతీ
విద్యుత్ సరఫరా సరిగా లేనందున ఇప్పటికే చాలామంది సన్న చిన్న కారు రైతుల పొలాలు ఎండిపోయే ప్రమాదం వస్తుందని అధికారులు తక్షణం చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకొని ప్రజలపై పెను బారాలు మోపుతున్న ఏ సి డి చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బల్ల సాయికుమార్,మారెడ్డి శివాజీ,బత్తుల నరసింహులు, దారపునేని రమేష్, ఎస్ వి ఎస్ నాయుడు, మువ్వా రామలక్ష్మి,అయినాల రామకృష్ణ, మారెడ్డి గణేష్, ప్రభు, రమేష్, అనిల్, చంటి, ఫ్రాన్సిస్, తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube