మంటగలుస్తున్న మానవ సంబంధాలు
– నడి రోడ్డుపై పొడిచి చంపిన అన్నదమ్ములు
– తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే భూమి పంచాలి అంటున్న కొడుకులు
టీ మీడియా, అక్టోబర్ 5, వనపర్తి బ్యూరో : ప్రపంచ దేశాలలో మనుషుల జనాభా నానాటికి పెరుగుతుంటే మానవత్వం మాత్రం దారుణంగా తగ్గిపోతుంది. చిన్నప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు ప్రేమానురాగాలకు అనురాగాలతో పెరిగి పెద్దయ్యాక ఆస్తుల కోసం ఒకరికొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే అవసరం లేకపోతే అమ్మను కూడా అంతం చేయాలని మానవ సంబంధాలు మంటగలుగుతున్నాయి. ఇలాంటి దుర్మార్గాలు రోజురోజుకు ఒకరు కనిపిస్తూ ఉన్నారు. తల్లిని మేడ మీద నుంచి తోసేసిన కొడుకు, ప్రేమించిందని కూతుర్ని హతమార్చిన తండ్రి, ఆస్తి కోసం తల్లిదండ్రులపై దాడి చేసే కొడుకులు, ప్రియుడు కోసం భర్తను చంపిన భార్య, ఆస్తి కోసం చెల్లెల్ని చంపిన అక్క, తల్లిదండ్రులు బతికి ఉన్నాంగానే భూమి పంచాలి అంటున్న కొడుకులు ఇలా నానాటికి మంటగలుస్తున్న మానవ సంబంధాలు ఈ భూమి మీద ఉన్న కోట్లాది జీవులలో ప్రేమ ఆప్యాయత అనురాగాలు బంధాలు ఆనందాలు ఇవి మనుషులమైన మనలో మాత్రమే ఉంటాయి. జంతువులకు బంధాలు ఉండవు మనుషులు బంధాలను మరిచిపోయి చంపుకునే స్థితికి దిగజారారు. తాజాగా వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం కుటుంబ సభ్యులతో భూ తగాదాలతో ఎంపీవో దారుణ హత్య జరిగింది.నడి రోడ్డుపై పొడిచి చంపిన అన్నదమ్ములు వివరాల్లోకి వెళితే భూ తగాదాల కారణంగా సొంత అన్నదమ్ముల చేతిలో వీపనగండ్ల ఎంపీవో (మండల పంచాయతీ అధికారి) మూడవత్ బద్రీనాథ్ (48) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగింది. బైక్ పై వెళ్తున్న బద్రీనాథ్ను ముగ్గురు అన్నదమ్ములు అడ్డగించి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ కెళ్లి లొంగిపోయారు. వనపర్తి మండలం రాజంపేట గ్రామానికి చెందిన మూడవత్ బద్రీనాథ్, మూడవత్ టోక్యో, మూడవత్ సర్దార్, మూడవత్ పరమేశ్ అన్నదమ్ములు. వీళ్లకు 25 ఎకరాల భూమి ఉంది.
Also Read : మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు
ఒక్కో ఎకరం కనీసం రూ.2 కోట్లపైనే పలుకుతుంది. పంపకాల విషయంలో కొన్నేండ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కత్తులతో బద్రీనాథ్ తమను బెదిరిస్తున్నాడంటూ ముగ్గురు అన్నదమ్ములు గ్రామంలో పంచాయితీ పెట్టారు. అయినా, వీరి మధ్య సయోధ్య కుదరలేదు. రోజురో జుకూ బెదిరింపులు ఎక్కువ కావడంతో బద్రీనాథ్ ను చంపేయాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. బుధవారం వీపనగండ్ల మండలంలో విధులు ముగించుకుని తన స్నేహితునితో బైక్ పై బద్రీనాథ్ వనపర్తికి బయలుదేరాడు. వనపర్తి రూరల్ పోలీస్ దగ్గర్లో బద్రీనాథ్ అన్నదమ్ములు అడ్డుకున్నారు.భూమి విషయమై నిలదీశారు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. అప్పటికే తమవెంట తెచ్చుకున్న టోక్యో, సర్దార్, పరమేశ్ ఎంపీవో బద్రీనాథ్ (ఫైల్) దాడి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బద్రీనాథ్ ఫ్రెండ్ కత్తిపోటుకు గురవడంతో అతన్ని స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. బద్రీనాథ్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురు బైక్పై పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. తామే బద్రీనాథ్ ను చంపినట్లు ఒప్పు స్టేషన్కు కున్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి దృశ్యాలు ప్రతిరోజు మనం అనేకం చేస్తున్నాం ఇప్పటికైనా మనుషులు శాశ్వతంగా ఉండేది ఆస్తి డబ్బు కాదు మంచితనం మానవ సంబంధాలు మాత్రమే శాశ్వతమని ప్రజలు గుర్తించినప్పుడే మందు తరాల వారికి మంచిని చెప్పేవారమవుతాం.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube