తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేత ఆగిపోవాలి
– పంజాబ్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
టీ మీడియా, నవంబర్ 7, న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలో పంట దిగుబడి ఇళ్లకు చేరిన అనంతరం రైతులు తమ పొలాల్లోని పంటవ్యర్థాలను తగులబెట్టడం పరిపాటిగా మారింది. అయితే ఈ పంట వ్యర్థాల కాల్చివేత పొరుగున ఉన్న దేశ రాజధాని ఢిల్లీకి శాపంగా పరిణమించింది. స్టబుల్ బర్నింగ్ కారణంగా వెలువడే పొగలు ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. దాంతో ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య తీవ్రత రోజురోజుకు అంతకంతకే పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య సమస్యపై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది. తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని వేళలా రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది. పంట వ్యర్థాల కాల్చివేత వెంటనే ఆగిపోవాలన్నదే తమ అభీష్టమని సర్వోన్నత న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొన్నది.
Also Read : ఏండ్లలో 5గురు సీఎంలను మార్చిన చరిత్ర బీజేపీది
‘పంట వ్యర్థాల కాల్చివేత ఆగిపోవాలని మేం కోరుకుంటున్నాం. మీరేం చేస్తారో, ఎట్ల చేస్తారో తెలియదు, స్టబుల్ బర్నింగ్‌ను నిలిపి వేయడం మీ బాధ్యత. తప్పనిసరిగా స్టబుల్ బర్నింగ్ ఆగిపోవాలి. అందుకోసం తక్షణమే ఏదో ఒక చర్య చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube