షార్ట్ సర్క్యూట్ లో కాలిపోయిన ఇల్లు
టీ మీడియా, జనవరి 18, మధిర : మధిర మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లబోతుల నాగేశ్వరరావు పూరి గుడిసె లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెరిగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరు లేరు. అయితే ఈ మంటల్లో పురీల్లు కాగా నిత్యావసర వస్తువులు, గత కొద్దిరోజులు క్రితం 7 క్వింటాల పత్తి అమ్మగా వచ్చిన సుమారు1 లక్ష నగదు, ఇంకా 6 క్వింటాల పత్తి పూర్తిగా దగ్ధం అయ్యాయి. నల్లబోతుల నాగేశ్వరరావు పరిస్థితి అగమ్యఘోచరంగా మారింది. ఎవరైనా బాధిత కుటుంబానికి సహాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.