తిరగబడ్డ ప్రయివేటు బస్సు

17గొర్రెలు మృతి..

1
TMedia (Telugu News) :

తిరగబడ్డ ప్రయివేటు బస్సు..

-17గొర్రెలు మృతి..

టి మీడియా,నవంబర్ 15,కాకినాడ : కాకినాడ రూరల్ తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధి అచ్చంపేట ఎడిబి రోడ్డు ఉండూరు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ప్రయివేటు బస్సు గొర్రెల మందను ఢీకొనడంతో 17 గొర్రెలు మృతి చెందాయి.అపెక్స్ ఆక్వా రంగంపేట బ్రాంచ్ కంపెనీ వాహనం తుని నుండి కంపెనీలో పనిచేసే మహిళా కార్మికులను తీసుకువస్తూ ఉదయం 6 గంటల ప్రాంతంలో గొర్రెల మందను గుద్దుకుంటూ వాహనం తిరగబడటం వల్ల బస్సులో ఉన్న సుమారు 30 మంది మహిళలు ప్రమాదం బారిన పడ్డారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Also read : బస్సులో చెలరేగిన మంటలు, తప్పిన పెను ప్రమాదం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube