వాగులో పడ్డ ఆర్టిసి బస్సు 9 మంది దుర్మరణం

వాగులో పడ్డ ఆర్టిసి బస్సు 9 మంది దుర్మరణం

0
TMedia (Telugu News) :
dead bodies
dead bodies

పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా తెలుగు వెలుగు బస్సు..
డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులు ఉన్నారు. వారిని దగ్గర్లోని జాలర్లు, స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా అప్పటికే ఊపిరి ఆడక ఏడుగురు మరణించారు.

గాయపడిన మిగతా వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సులో 47 మందికి పైగా ప్రయాణికులు ఉండడం.. ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

నైట్ ఆల్ట్ ఉండి

.రాత్రి వేలేరుపాడు నైట్ ఆల్ట్ ఉండి అక్కడ నుండి ఉదయం భద్రాచలం వెళ్లి మరల కుకునూరు మీదుగా అశ్వరావుపేట నుండి జంగారెడ్డిగూడెం వరకు బస్సు గమ్యం పూర్తి అవుతుంది…. ఈ క్రమంలో జల్లేరు వాగు వద్ద అదుపు తప్పి జారీ పడిన బస్సు ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కి పైగా నే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం….. ఇప్పటి వరకు 9 మంది మరణించగా మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం…..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube