బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి

బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి

1
TMedia (Telugu News) :

బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలి

టీ మీడియా, జూన్ 16, వనపర్తి బ్యూరో : బస్ చార్జీలు, విద్యార్థుల బస్సు పాస్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఆర్డీవో కార్యాలయ సిబ్బంది సుజాతకి కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన టిఎన్ఎస్ఎఫ్ బృందం వనపర్తి జిల్లా బుధవారం ఇటీవల పెరిగిన బస్సు చార్జీలు మరియు విద్యార్థుల బస్సు పాస్ ధరలు పెరిగిన కారణంగా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బస్ చార్జీలు పెంచింది.

Also Read : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేద్దాం

దీనివలన పేద విద్యార్థులు పేద విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. అసలే కరోన కష్టాల నుంచి కోలుకుంటున్న ప్రజలపై బస్ చార్జీలు పెంచి ఇబ్బందులకు గురి చేయడం చాలా బాధాకరం అని TNSF నాయకులు అన్నారు. పెంచిన బస్ చార్జీలు బస్ పాస్ ధరలు తగ్గించాలని టిఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్రం వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Also Read : ప్రజల అజెండాను ముందుకు తీసుకువచ్చే “జనం కోసం సిపిఎం”

ఈ కార్యక్రమంలో TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి టి అమరేందర్ , రాష్ట్ర కార్యదర్శి తిరుమలేష్ , వనపర్తి జిల్లా అధ్యక్షుడు , కళ్యాణ్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి , హేమంత్ , రాష్ట్ర నాయకులు నాగేష్ , రామాంజనేయులు, వెంకటేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube