ఆటోను ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం
టీ మీడియా, ఫిబ్రవరి 16, చౌటుప్పల్ : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులో ఆటో-బస్సు ఢీకొనడంతో నలుగురు మహిళా కార్మికులకు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. అంతేకాకుండా ఆటోలోని మరో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి వెళ్తున్న బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన నలుగురు మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మహిళా కార్మికులు మృతిచెందారు.
Also Read : కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు..!
మృతులను డాకోజి నాగలక్ష్మి (28), వరకాంతం అనసూయ(55), సిలివేరు ధనలక్ష్మి (35), దేవరపల్లి శిరీష(30)గా గుర్తించారు. మృతులంతా ఓ పచ్చళ్ల పరిశ్రమలో ఉపాధి పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube