చౌరస్తాలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయండి

చౌరస్తాలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయండి

0
TMedia (Telugu News) :

చౌరస్తాలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయండి

టీ మీడియా,ఏప్రిల్ 9, గోదావరిఖని :

వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువ అవుతుండడం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులతో పాటు విద్యార్థులు మరియు యువతీ యువకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కార్పొరేషన్ కార్యదర్శి ఈర్ల రామచందర్,భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పందిరి భారీ వర్షానికి పడిపోవడంతో అక్కడ నిలువనీడ లేకుండా పోయింది అన్నారు. అదే విధంగా ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ ద్వారా పక్కనే ఉన్న బస్ షెల్టర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని వాటిని ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఆర్టీసీ వారి సహకారంతో ప్రధాన కూడలిలో ప్రయాణికులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా కమిషనర్ ని కోరారు.విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు వారు పరీక్షలు రాయడానికి వెళ్లడానికి ఈ ప్రధాన చౌరస్తా దగ్గర బస్సులు ఎక్కాలి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్స్ కి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో మంది నిరుద్యోగ యువత కూడా ఈ ప్రధాన చౌరస్తా గుండా కోచింగ్ సెంటర్లకి వెళ్లాల్సింది ఉంటుంది.

Also Read;—-రూ.3 .90 కోట్లుతో ఇంటిగ్రేటెడ్ మార్కెట-కలెక్టర్ భారతి హోళికేరి..

అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వారి సహకారంతో వెంటనే ఇక్కడ బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. దీనిపైన స్పందించిన కమిషనర్ రెండు మూడు రోజుల్లో బస్సు షెల్టర్లును ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేయిస్తామని ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుగుగురాళ్ల కళ్యాణ్,గణేష్ పాల్గొన్నారు.

Also Read;వెటరన్ క్రీడాకారుడు శంకర్ కు సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube