బస్సును ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

బస్సును ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

1
TMedia (Telugu News) :

బస్సును ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

 

టీ మీడియా, ఆక్టోబర్ 24, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామం ప్రజాప్రతినిధులు, పెద్దలు, యువకులు గత కొద్ది రోజుల కింద శాఖాపూర్ వై గ్రామానికి బస్సును నడపాలని వనపర్తి డిఎంకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన డిఎం బస్సు నడపడానికి ఆదేశాలిచ్చిన వనపర్తి డిఎం పరమేశ్వర్ కి కృతజ్ఞతలు తెలియజేసిన శాగాపూర్ వై గ్రామ సర్పంచ్ మేకల రవికుమార్ యాదవ్, ప్రజాప్రతినిధులు, పెద్ద మనుషులు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత గ్రామానికి బస్సు రావడం చాలా సంతోషంగా ఉందని గ్రామం మొత్తం దీపావళి పండుగ వాతావరణంలో ఉన్నదని అందులో బస్సు రావడంతో ఆనంద ఉత్సవాలతో పండగ జరుపుతున్నారని తెలిపారు. గ్రామ ప్రజలందరూ కూడా ఆటోలో ప్రయాణించకుండా బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీ సంస్థ వారికి సహకరించి అధిక కలెక్షన్ అయ్యి బస్సు నిరంతరం నడపడానికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కండక్టర్ డ్రైవర్ కి ఘనంగా సన్మానం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube