ముమ్మరంగా వాహనాలు తనిఖీలు

1
TMedia (Telugu News) :

-వాహనదారులు నిబంధనలు పాటించాలి

టీ మీడియా,డిసెంబర్ 22,కరకగూడెం;

వాహనదారులు క్రమం తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కరకగూడెం ట్రైనీ ఎస్సై గణేష్ అన్నారు.
ఈ మేరకు ఆయన ఋధవారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా కరకగూడెం ట్రైనీ ఎస్సై గణేష్ వాహన దారుల ధ్రువ పత్రాలను పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్కు తో పాటు పొల్యూషన్ తదితర పత్రాలు కలిగి ఉండాలని అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించరాదని తెలిపారు.

అతి వేగంగా వాహనాలు నడపకూడదు అని ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని ఎక్కించుకోరాదు అని సూచించారు.అదే విధంగా పలువురు వాహనదారులకు ఈ-చలాన్ ద్వార చలాన విధించారు.స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Karakagoodem trainee SI Ganesh said motorists should follow the rules of the road regularly. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube