ఆరోగ్యం కోసం పెరుగు కంటే మజ్జిగ ప్రయోజనకరమా..?

ఆరోగ్యం కోసం పెరుగు కంటే మజ్జిగ ప్రయోజనకరమా..?

0
TMedia (Telugu News) :

ఆరోగ్యం కోసం పెరుగు కంటే మజ్జిగ ప్రయోజనకరమా..?

లహరి, ఫిబ్రవరి 3, ఆరోగ్యం : మనలో చాలా మంది పాలు, పెరుగు లేకుండా అసలు తినలేరు. పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటి మధ్య తేడాలు చాలానే ఉన్నాయి. అవి అందించే పోషకాలు, ప్రయోజనాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే పాలు, పెరుగుకు బదులుగా మజ్జిగ తాగాలని సూచిస్తుంటారు. అందుకు ఈ మూడు శరీరంలో ప్రతి స్పందించే విధానంలోని మార్పులే అందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది. అది కడుపులోకి వచ్చినపుడు కూడా పొట్టలోని వేడి ఆమ్లాలు కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల కడుపులోని పేగులు వేడెక్కుతాయి. కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుందని అంటున్నారు. వారి సూచనల ప్రకారం మజ్జిగ అన్ని రకాల శరీరాలకు, సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనదని స్పష్టం చేశారు. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా పెరుగును అందరూ తినలేరు.మజ్జిగ ప్రయోజనాలు:
పెరుగుకి బదులు దాని నుంచి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. వాపు, జీర్ణ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, ఆకలి లేకపోవడం, రక్తహీనత సమస్యలను నివారించడంలో మజ్జిగ సహాయపడుతుంది.

Also Read : గాయంత్రీమంత్రం అర్థం, ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా..?

చలికాలంలో అయితే అజీర్ణం సమస్య ఎదురవకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం సులభం. ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక. ఇంకా మజ్జిగ శరీర బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు.. బరువు తగ్గాలంటే మజ్జిగ ఎంచుకోవాలి. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube