ధాన్యాని మద్దతు ధరకే కొనాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 24 వనపర్తి : వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని కోరుతూ బుధవారం వనపర్తి మండల తాసిల్దార్ రాజేందర్ గౌడ్ కి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెబుతూ రైతులను నట్టేట ముంచే విధంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోవడం కేంద్రం నిర్లక్ష్యం చేసిందని చెబుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచే పరిస్థితి ఈ విధంగా ఉన్న పరిస్థితి అని వివరించారు. రైతుల పంట పండించడానికి ఎన్నో కష్టాలు పడుతూ తదనంతరం పండించిన పంటను కొనుగోలు చేయలేకపోవడం వల్ల వరి ధాన్యం కుప్పలు రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులకు డబ్బులు చెల్లించాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన మద్దతు ధర ఇప్పటికీ అదే విధంగా ఉందని ఎద్దేవా చేశారు. వారికి కనీస మద్దతు ధర 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు రైతుల బాధలు తెలంగాణ అభివర్ణించారు తెలంగాణ రైతుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగులుతుంది అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపిపి శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు డి.కిరణ్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు రాధాకృష్ణ, బ్రహ్మం, పాండు సాగర్, విష్ణువర్ధన్రెడ్డి, కోట్ల రవి, చీర్ల జనార్ధన్, యాదయ్య, సురేష్, రాములు వెంకటేశ్వర్రెడ్డి ,లక్ష్మయ్య, బాలరాజు, మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube