మూడు కార్పొరేషన్ల విలీనానికి కేంద్రం నిర్ణయం!
ఆప్ సర్కారుకు షాక్
టీ మీడియా ,మార్చి 22 న్యూఢిల్లీ : పంజాబ్ ఎన్నికల్లో విజయంతో జోరుమీదున్న ఆప్ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశ రాజధానిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికార పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ కానున్నది. కార్పొరేషన్ల విలీనానికి మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై ఢిల్లీకి ఒక్కరే మేయర్ ఉండనున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లు కాకుండా ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటు కానున్నది.ఈ మేరకు డీఎంసీ చట్టంలోని సెక్షన్లో మార్పులు జరుగనున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం లోని 17 సెక్షన్ల అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వం నుంచి కేంద్రం తొలగించే అవకాశం లేకపోలేదు. ఇంతకు ముందు సెక్షన్ల కింద చర్యలు హక్కు కేంద్రానికి హక్కు ఉండేది. అయితే, 2009 అక్టోబర్‌లో కేంద్రం ఆయా సెక్షన్ల కింద చర్యలు తీసుకునే హక్కును ఢిల్లీ ప్రభుత్వానికి బదలాయించింది. అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌పై ఢిల్లీ ప్రభుత్వ జోక్యం పెరిగింది.బీజేపీ నేతల డిమాండ్‌తోనే..ఢిల్లీ ప్రభుత్వం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారాన్ని బదలాయించాలని స్థానిక బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే మూడు కార్పొరేషన్లను విలీనం చేసి, డీఎంసీ చట్టంలో మార్పులు చేసినట్లుగా వార్తలున్నాయి. ఆప్ ప్రభుత్వం కార్పొరేషన్లలో సంబంధిత విభాగాలకు చెందిన పనుల ఫైళ్లపై జాప్యం చేస్తోందని, తద్వారా కార్పొరేషన్ల పనితీరుపై ప్రభావం చూపుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.
Also Read : విషమించిన లాలూ ఆరోగ్యం
ఈ క్రమంలో కార్పొరేషన్లను కేంద్రం అధీనంలోకి తీసుకోవాలని బీజేపీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 2009లో ఢిల్లీలోని షీలా దీక్షిత్ ప్రభుత్వం డీఎంసీ చట్టంలోని 23సెక్షన్లకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి బదలాయింపు కోసం కేంద్ర వ్యవహారాల మంత్రిత్వశాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే, కేంద్రం 17 సెక్షన్లపై పూర్తి అధికారాన్ని అప్పటి ప్రభుత్వం ఇవ్వగా.. ఐదు సెక్షన్ల కింద కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే హక్కును కల్పించింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube