నాటకరంగ దినోత్సవ వేడుకలు

టీ మీడియా,ఏప్రిల్ 18,జగిత్యాల

1
TMedia (Telugu News) :

నాటకరంగ దినోత్సవ వేడుకలు

టీ మీడియా,ఏప్రిల్ 18,జగిత్యాల :
కొడిమ్యాల మండల కేంద్రంలో కందుకూరి వీరేశలింగం జన్మదినం సందర్భంగా నాటకరంగం దినోత్సవం పురస్కరించుకుని కడమేడ కళా సాహితీ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కడమేడ కళాసాహితి అధ్యక్షులు మల్లారపు రాజయ్య మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం ఎన్నో నాటకాలు వేశారని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త అని కొనియాడారు. కందుకూరి జన్మదిన రోజును నాటక రంగ దినోత్సవం గా జరుపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కడమేడ కళాసాహితి కార్యదర్శి ఇనుగంటి సత్యానందం, సభ్యులు నాంపెళ్లి శ్రీనివాస్, అంతర్జాతీయ అవార్డు గ్రహీత ఏనుగు ఆదిరెడ్డి ,ఎర్రోజు మోహనాచారి మంద గోపాల్ రెడ్డి ,నలిగేటి తిరుపతి,గంగ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

also read ; అద్దంలా మెరుస్తున్న రోడ్లు : మంత్రి ఎర్రబెల్లి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube