టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరించిన జడ్పి చైర్పర్సన్

టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరించిన జడ్పి చైర్పర్సన్

1
TMedia (Telugu News) :

టీఎన్జీఓ క్యాలెండర్ ఆవిష్కరించిన జడ్పి చైర్పర్సన్

టీ మీడియా, మార్చి 12,ఖమ్మం: నగరంలోని జడ్పి మీటింగ్ హల్ లో
టీఎన్జీవోస్ మధిర యూనిట్ తాలూకా లకు చెందిన నూతన(2022) సంవత్సర క్యాలెండర్ ను యూనిట్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు సుదర్శన్,మల్లారెడ్డి ల ఆధ్వర్యంలో శనివారం జడ్పి చైర్పర్సన్ లింగాల కమల్ రాజ్,టీఎన్జీవోస్ యూనియన్ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్,ఆర్.వి.ఎస్.సాగర్ లు సంయుక్తంగా ఆవిష్కరించారు.

గుర్తింపు తెచ్చింది.
*షేక్.అప్జల్ హసన్ *

Also Read : నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో గతం లోజిల్లా వ్యాప్తంగా జిల్లా క్యాలెండర్ మాత్రమే ప్రచురితం చేసేవారు. ప్రస్తుతం ఆయా తాలూకా,యూనిట్ల క్యాలెండర్ లలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు అక్కడి యూనిట్ అధ్యకార్యదర్శుల ఫొటోలతో ముద్రించడం తో వారికి గుర్తింపు వచ్చినట్లు టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ అన్నారు.అదేవిధంగా మధిర యూనిట్ భవనం శిథిలావస్థలో ఉందని కొత్త భవనాల నిర్మాణానికి మీ వంతు ఆర్థిక సహాకారం చేయాలనీ జడ్పి ఛైర్మెన్ లింగాల కమల్ రాజ్ ని కోరారు.
క్యాలెండర్ ఆవిష్కరణ లో భాగంగా జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి
ఆర్.వి.ఎస్.సాగర్ లు మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో బలమైన సంఘంగా ఏర్పచుకొనున్నట్లు తెలిపారు.టీ ఎన్ జి ఓ కేంద్ర కమిటీ నాయకులు మామిళ్ల రాజేందర్ గారు,రాయకంటి ప్రతాప్ ల సారథ్యంలో ఉద్యోగుల అభివృద్ధికి పెద్దపీఠ వేయనున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసినప్పటికీ 371(డి)లో ఉన్న సవరణలలో రాష్ట్రపతి ఆమోదం తెచ్చుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయడం శుభపరిణామం. స్థానికంగా చదువుకున్న నిరుద్యోగులకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 95 శాతం దక్కనున్నట్లు తెలిపారు.

*ఉద్యోగులు మన కుటుంబంలో ఒకరు

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఉద్యమాన్ని ముందుండి నడిపారు.అలాంటి ఉద్యోగుల మన కుటుంబంలో ఒకరని సీఎం కేసీఆర్ అన్నారని లింగాల కమల్ రాజ్ తెలిపారు.మధిర యూనిట్ భవన నిర్మాణానికి సంబంధించి ఉద్యోగులు వెళ్లి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కలిసి సమస్యను వివరించండి.ఆ తర్వాత సిడిపి నిధుల నుంచి భవన నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఉద్యోగులకు భరోసాను,నమ్మకం ను కల్పించిన వ్యక్తి సీఎం కేసీఆర్ని పేర్కొన్నారు.90 వెల ఉద్యోగాలకు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించారని తెలియజేశారు.రాష్ట్రంలో ప్రైవేటీకరణ లేకుండా సీఎం కేసీఆర్ చేస్తోన్నరని చెప్పారు.ఏ సమస్య వచ్చినా మీకు అండగా ఉంటానని తెలిపారు.అనంతరం మధిర యూనిట్ ఆధ్వర్యంలో జడ్పి చైర్పర్సన్ ను ఘనంగా సత్కరించారు.

Also Read : తెలంగాణ లో ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను,దాసరి రవి కుమార్,
ట్రెజరర్ భాగం పవన్ కుమార్,డ్రైవర్ల సంఘం అధ్యక్షులు హకీమ్,సైదులు
టౌన్ వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ ఆర్.ఎన్.ప్రసాద్,విఆర్వో ల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా,చీమల నాగేందర్,
ఏఎంసి ఫోరమ్ అధ్యక్షులు తాడేపల్లి కిరణ్ కుమార్….

మధిర యూనిట్ నుంచి

వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు,జ్యోత్స్న, కమల,ధనలక్ష్మి,పిటి.కిరణ్,యాకూబ్ పాషా….

ఫోరమ్ ల నుంచి ….

అగ్రికల్చరల్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు చంద్రశేఖర్,బంగారయ్య,
వేటర్నిటీ ఫోరమ్ అధ్యక్షులు సత్యనారాయణ, ఫారెస్ట్ ఫోరమ్ సెక్రెటరీ అనిల్ కుమార్,మెడికల్ ఫోరమ్ అధ్యక్షులు యం. సత్యనారాయణ,డీఈవో ఫోరమ్ సెక్రెటరీ నగేష్,ఇరిగేషన్
మెయిన్ టెనెన్స్ ఫోరమ్ నుంచి వెంకట్,హాస్టల్ వెల్ఫేయిర్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు రుక్మరావు,నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube