మొబైల్స్‌లో ‘కాల్ రికార్డింగ్’ ఇక అసాధ్యం -గూగుల్ కొత్త రూల్
టి మీడియా, ఎప్రిల్22,హైదరాబాద్:ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే.. ఇక అవేవీ పనిచలన నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్స్ అన్నింటికీ సపోర్ట్ నిలిపివేసేందుకు సిద్ధమైంది. అంటే.. వాయిస్ కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ఆ సంభాషణను రికార్డ్ చేయడం ఇక కుదరదు. మే 11 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకివచ్చే అవకాశముంది.ఎందుకిలా?: మెజార్టీ స్మార్ట్ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్‌ను తయారు చేసే గూగుల్ సంస్థ. కాల్ రికార్డింగ్‌కు ఎప్పుడూ వ్యతిరేకమే. అవతలి వ్యక్తికి చెప్పకుండా సంభాషణ రికార్డ్ చేయడం ద్వారా యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్నది గూగుల్ వాదన. అందుకే కాల్ రికార్డింగ్ యాప్స్ కట్టడికి ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.
Also Read : అనూషపై దాడి విచారకరం..నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం
ఆండ్రాయిడ్ 6 ఓస్ తెచ్చినప్పుడు ఈ యాప్స్‌పై తొలిసారి వేటు వేసింది గూగుల్. కాల్ రికార్డింగ్‌కు వీలు కల్పించే ఏపీఐని తొలగించింది. అయితే.. యాప్ డెవలపర్లు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. సరికొత్తగా మళ్లీ కాల్ రికార్డింగ్ యాప్స్ తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 9 ఓఎస్‌లో వాటికీ కళ్లెం వేసింది గూగుల్. అయితే.. ఆండ్రాయిడ్ యాక్సెసబిలిటీ ఏపీఐని ఉపయోగించి కొందరు యాప్ డెవలపర్స్ మళ్లీ కాల్ రికార్డింగ్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఇప్పుడు దీనిపై వేటు వేస్తోంది గూగుల్.కాల్ రికార్డింగ్ ఇక అసాధ్యమా?: గూగుల్ వర్గాల ప్రకారం.. మే 11 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కాల్ రికార్డింగ్ కుదరదు. గూగుల్ డయలర్ లేదా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ డిఫాల్ట్‌గా ఇచ్చే డయలర్(ఉదాహరణకు ఎంఐ డయలర్) ద్వారా మాత్రమే కాల్ రికార్డింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే.. గూగుల్ డయలర్ ద్వారా ఎవరైనా ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటే.. అవతలి వ్యక్తికి కూడా తెలిసేలా ‘ఈ కాల్ రికార్డ్ అవుతుంది’ అని అలర్ట్ వస్తుంది._
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube