రెవిన్యూ సదస్సుల పై విస్తృతంగా ప్రచారం
-కేంద్రాలు వద్ద సదుపాయాలు
-విసి ద్వారా సమీక్ష లో సీఎస్ సోమేశ్ కుమార్
టి మీడియా, జులై 8,హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు ఇతర రెవెన్యూ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Also Read : వై ఎస్ ఆర్ ప్రజాలగుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారు
రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో అందే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి నిర్వహించనున్న కలెక్టర్ల సమావేశానికి, జిల్లా అధికారులు సమగ్ర సమాచారంతో రావాలని కోరారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube